SAKSHITHA NEWS

సాక్షిత తిరుపతి నగరం:
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మనందరికి ఆదర్శనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో అలంకరించి, టెంకాయలు కొట్టి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావలనే లక్ష్యంతో ఆమరణ నిరాహర ధీక్షకు పూనుకొని, తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములును తెలుగు జాతి ఎన్నటికి మరవదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఆర్వోలు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, సెక్రటరీ రాధిక, ఆరోగ్యాధికారి డాక్టర్ అన్వేష్ రెడ్డి, ఫైర్ అధికారి శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్రరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, మెనేజర్ చిట్టిబాబు, సూపర్డెంట్లు, ఆర్.ఐలు, సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.