SAKSHITHA NEWS

హైదరాబాద్:
హోంగార్డు రవీందర్ మృతదేహానికి మరికొద్దిసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఉస్మాని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ…

రవీందర్ 68% గాయాలతో ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకువచ్చారన్నారు. ఇక్కడికి తీసుకొచ్చిన సమయంలో రవీందర్ అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు.

మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రి నుంచి డీఆర్డిఓ అపోలో హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. ఇలాంటి బర్నింగ్ కేసుల్లో 50% పైగా బర్న్ అయితే బతకడం కష్టంగా ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి రవీందర్ తరలించేటప్పుడు వైద్యానికి కూడా బాడీ సహకరించలేదన్నారు.

ముగ్గురు వైద్యుల బృందంతో మరికొద్ది సేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తామని అన్నారు. పోలీసుల నుంచి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.

పోలీస్ నుంచి క్లియరెన్స్ రాగానే హోంగార్డ్ రవీంద్ర మృతదేనికి పోస్టుమార్టం పూర్తి చేస్తామని సూపరింటెండెంట్ నాగేంద్ర వెల్లడించారు…


SAKSHITHA NEWS