SAKSHITHA NEWS

ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క

ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చి పేదలకు 100 రోజులు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి

2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ 2లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.

బిజెపి అబద్దపు ప్రచారాలు నమ్మవద్దు

ప్రభుత్వ సంస్థలను అమ్మే బిజెపి కావాలా…. దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచన చేయాలి.

రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క


వేంకటా పూర్ మండల కేంద్రములో నల్లగుంట
మరియు రామాంజ పూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల తో సమావేశం అయి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని అభ్యర్థించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఏడాదికి 42 రోజులె పని కల్పిస్తుంది అని మళ్ళీ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడం తో పాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని మంత్రి వర్యులు సీతక్క అన్నారు
మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యం
మీరు బలరాం నాయక్ కి తోడుగా నిలవండి…. నేను మీకు అండగా ఉంటాను…
యువకుల బలిదానాలు చూసి సోనియామ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.కానీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ దుర్మార్గపు పాలనతో సర్వనాశనం చెశారు.


కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
10ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, ఆక్రమాలు తప్ప ఏమి లేదు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో 5న్యాయలతో ప్రజలకు న్యాయం జరుగుతుంది
అసెంబ్లీ ఎన్నికలలో 6గ్యారంటీలు ఇచ్చాము
ఇప్పటికే 5గ్యారంటీలను అమలు చేశాం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని మన ప్రాంత బిడ్డ గతములో కేంద్ర మంత్రి గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని మంత్రి సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

WhatsApp Image 2024 04 24 at 1.17.30 PM

SAKSHITHA NEWS