పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
నాయకన్ గూడెంలో యాకుబ్ కుటుంబానికి పరామర్శ
బుద్ధారంలో బ్రిడ్జి, రోడ్డు మరమ్మత్తుల కోసం ఆర్ అండ్ బి ఎస్ఈకి వినతి
ఖమ్మం రూరల్ లోనూ బాధిత కుటుంబాలకు భరోసా*
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన గ్రామాలను సందర్శించారు. కూసుమంచి మండలంలో నాయకన్ గూడెం, నర్సింహుల గూడెం, పెరిక సింగారం, కూసుమంచి గ్రామాలను, నేలకొండపల్లి మండలంలో బుద్ధారం, కట్టుకాచారం గ్రామాలను, ఖమ్మం రూరల్ మండలంలో జలగంనగర్, కరుణగిరి పరిసరా ప్రాంతాలను సందర్శించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకన్ గూడెంలో వరదల్లో కొట్టుకుని పోయిన యాకుబ్ కుటంబాన్ని పరామర్శించారు. అతని భార్య ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించాలని అధికారులను కోరారు. నేలకొండపల్లి బుద్ధారంలో వర్షాలకు కొట్టుకుని పోయిన బ్రిడ్జి, రోడ్డు పనులను వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయించాలని ఫోన్ ద్వారా కోరారు. కట్టుకాచారంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు