పోరిక మౌనిక కు పొంగులేటి అభినందనలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
భద్రాచలం కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వాణి కుమారి కుమార్తె పోరిక మౌనిక ఐపిఎస్ ట్రైనింగ్ ను విజయవంతం గా పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర క్యాడర్ కు ఎంపిక కావడం పట్ల ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మాటలకే తప్ప చేతలు శూన్యం
తెలంగాణ ప్రభుత్వం లో కానరాని అభివృద్ధి…
అందరి బంధువుగా శీనన్నను ఆదరించండి
-బయ్యారం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో పొంగులేటి
గడిచిన ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో నాయకుల మాటలు… హామీలకే పరిమితమైనాయి తప్ప ఆచరణ లో మాత్రం ఐదు శాతం కూడా అభివృద్ధికి నోచుకోలేదని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. బయ్యారం మండల కేంద్రంలో పొంగులేటి శీనన్న, కోరం కనకన్నల పేరుతో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి బంధువుగా… నిరుపేదలను ఆదుకోనేందుకు శీనన్న ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడన్నారు. అభివృద్దే లక్ష్యంగా పార్టీల కు అతీతంగా మనందరం కలిసి పనిచేద్దామని… మీ సూచనలు సలహాల మేరకు నడుచుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎనాడైనా నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడ్డారా అని ప్రశ్నించారు. ఇల్లందు నియోజక వర్గంలో ఆదివాసులు, గిరిజనులు, గిరిజనేతరులకు అభివృద్ధి ఫలాలు అందాయా అని ప్రశ్నించారు.
రైతులకు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయంబర్సుమెంటు దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం వచ్చాయా అని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలో మీరే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం… రాబో యే రోజుల్లో మీకు అందు బాటులో ఉంటూ ఎల్ల వేళలా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో శీనన్న క్యాంపు కార్యాలయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఈ కార్యాలయాల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కోరం కనకయ్య, మండల సర్పంచ్ పొలే బోయిన వెంకటేశ్వర్లు, నాయకులు సంకు సత్తిరెడ్డి, వన్నం రామారావు, రెంటాల బుచ్చిరెడ్డి, సర్పంచులు, ఎంపిటిసి లు సనప సోమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పాలేరు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం
పాలేరు నియోజకవర్గ స్థాయి పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 5న ఆదివారం తిరుమలాయపాలెం మండల కేంద్రం ప్రక్కన గల మైదానంలో జరగనుంది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ సమ్మేళనానికి పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని దయాకర్ రెడ్డి కోరారు.