SAKSHITHA NEWS

పోలీస్ తనిఖీల్లో 265 కేజీల గంజాయి స్వాధీనం
-9 మంది అరెస్ట్.. బైకు స్వాదీనం
-ఏఎస్పీ పంకజ్ మీనా

సాక్షిత చింతూరు :
పోలీస్ తనిఖీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 265 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ పంకజ్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 రోజుల ఏక్షన్ ప్లాన్ లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు చింతూరు సబ్ డివిజన్లో మోతుగూడెం మరియు చింతూరు పోలీస్ స్టేషన్ పరిదిలో వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా మూడు గంజాయి కేసులను నమోదు చేయడం జరిగిందని ఏఎస్పి తెలిపారు.

ఓడిషా నుండి గోదావరిఖని, తెలంగాణాకు 20 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న నిమ్మల మణికంఠ, ఓడిషా నుండి యదాద్రి భువనగిరి, తెలంగాణాకి 215 కేజీల గంజాయిని టి.ఎస్. 07యు.బి. 8576 కారులో ధీరావత్ గణేష్ లను చెక్ పోస్ట్ వద్ద, ఓడిషా నుండి పాలవంచ, తెలంగాణాకు తరలించడానికి సిద్దంగా ఉంచిన 30 కేజీల గంజాయిని చింతూరు బస్సు స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయితోపాటు ఒక మోటార్ సైకిల్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో చింతూరు మండలానికి చెందిన సోయం సందీప్, షేఖ్ హర్బజ్, కొర్స నవీన్, నారకొండ ప్రకాష్, మినప హరిప్రసాద్ లతో పాటుగా తెలంగాణాకు చెందిన సవలం ప్రకాష్ మరియు సానబోయిన శ్రావణ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ .13,25,000/-.ఉంటుందన్నారు. చింతూరు సబ్ డివిజన్ పరిదిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించి గంజాయి రవాణాను అరికడతామని తెలిపినారు. ఈ సమావేశంలో చింతూరు సి.ఐ. గంజేంద్ర కుమార్, చింతూరు ఎస్సై శ్రీనివాసరావు మరియు మోతుగూడెం ఎస్సై గోపాలరావు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS