పోలీసు ఉద్యోగవిరమణ.

Spread the love

ఉద్యోగవిరమణ పొందిన SI ఇబ్రహీం దంపతులను సన్మానించిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్.

కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఎస్పి నాగేశ్వరరావు, ఎఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఏఓ మంజు భార్గవి.

……

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: నేడు ఉద్యోగవిరమణ పొందిన ఎస్‌.ఐ ఇబ్రహీం దంపతులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో సూర్యాపేట జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ సన్మానించారు. ఎస్‌.ఐకి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ నందు పోలీస్ కానిస్టేబుల్ గా భర్తీఐ తన 40 సంవత్సరాల సేవలు అందించడం గొప్పవిషయమని అభినందించారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యే పోలీసులు ఉద్యోగం లో చేరినప్పుడు పరిస్థితులు పోలీసలకు చాలా క్లిష్టంగా ఉండేవి, అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించారు, చాలా మంది పోలీసులు త్యాగాలు చేయడంవల్లే నేటి సమాజం శాంతియుతంగా ఉందని ఎస్పి రిటైర్ అధికారిని అభినందించారు.
ఈ ఉద్యోవిరమణ అనంతరము ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు తెలిపిపారు. పోలీసు ఉద్యోగం నిత్యం సవాళ్లతో కూడినది, ఎన్నో రోజులు కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించాల్సి వస్తుంది, అలాగే ఎంతో ఇమేజ్ ఉన్న ఉద్యోగం అని అన్నారు.

ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ మాట్లాడుతూ సిబ్బంది, ఉన్నతాధికారుల సహకారంతో ప్రజలు సేవలు అందించాలని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, ఎస్ఐ లు, సంఘం సభ్యులు అంజన్ రెడ్డి, వెంకన్న, వెంకయ్య, డిపిఓ సిబ్బంది, ఉద్యోగవిరమణ పొందిన ఇబ్రహీం కుటుంభం సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page