SAKSHITHA NEWS

Police Martyrs Memorial Day

పోలీసు అమరవీరులను స్మరించుకునే రోజుకు మహోన్నత చరిత్ర : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

*నరసరావుపేట పట్టణములోని జిల్లా క్రీడా మైదానం లో జరిగిన పరేడ్ కార్యక్రమానికి హాజరు*
పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలోని జిల్లా క్రీడా మైదానంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన వారికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులు జ్ఞాపికను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ , ఎస్పీ రవి శంకర్ రెడ్డి , జేసి శ్యామ్ సుందర్ , అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు

పోలీసు అమరవీరులను స్మరించుకునే రోజుకు మహోన్నత చరిత్ర ఉంది. 1959, అక్టోబరు 21.. అంటే సరిగ్గా 63 ఏళ్ల కిందట ‘భారత్‌ – టిబెట్‌’ సరిహద్దుల్లోని లడక్‌లోగల ఆక్సాయ్‌చిన్‌ వద్ద భారత్‌కు చెందిన కేంద్ర రిజర్వు పోలీసులు (సీఆర్‌పీఎఫ్‌) రక్షణలో ఉన్నారు. విపరీతమైన చలిలో 10 మంది సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, చైనా సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకువచ్చారు.

వారిని ఈ 10 మంది పోలీసులు ధైర్యంగా ఎదిరించారు. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు బాశారు. భారత దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సందర్భమది. ఇందుకుగాను అన్ని రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమయ్యారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. అమర పోలీసుల త్యాగాన్ని స్మరించుకొని వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు


SAKSHITHA NEWS