‘ప్రజల కోసమే పోలీసులు’*
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
నందిగామ నూతన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం
హాజరైన తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపిఎస్.,
సాక్షిత : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
రంగారెడ్డి జిల్లా లోని షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో నందిగామ లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్., మహబూబ్ నగర్ ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ టి. అనిత హరినాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే కు పోలీస్ శాఖకు హామీ ఇచ్చారు. CSR ఫండ్ క్రింద నందిగామ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహయ సహకారలందించిన NATCO ఛైర్మన్ రాజేశ్ ను హోంమంత్రి మహమూద్ అలీ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మహబూబ్ నగర్ ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా జెడ్ పి ఛైర్మన్ శ్రీమతి టి. అనిత హరినాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, NATCO ఛైర్మన్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపిఎస్., సైబరాబాద్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపిఎస్., శంషాబాద్ డిసిపి నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్, నందిగామ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.