ఇద్దరూ చిన్నారులు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్ గేయాన్ని విడుదల చేసిన డాక్టర్ అన్వర్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పవిత్ర రంజాన్ మాసం నెలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన ఖమ్మంలో అబ్దుల్లా జావెద్ యూట్యూబ్ ఛానల్ లో సారా సుమయ్యా, సమ్రహ్ సరూష్ ఇద్దరూ అక్క చెల్లెళ్లు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్ గేయాన్ని పల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అన్వర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇద్దరూ చిన్నారులు అరబిక్ గేయాన్ని చాలా చక్కగా చూడముచ్చటగా పాడారని అన్నారు. పిల్లలను ఈ సందర్భంగా అభినందించారు ఇద్దరూ చిన్నారులు అరబిక్, ఉర్డు,తెలుగు,ఇంగ్లీష్ బాషల్లో నైతిక విలువల తో కూడిన పాటలు మరియు ప్రసంగాలు ద్వారా తోటి విద్యార్థుల కు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. చిన్నారుల తో తీసిన వీడియోను చూసిన పిల్లలలో చైతన్యం తీసుకు వస్తున్న అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్ కృషిని అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని నైతికత తో కూడిన వీడియోలు తీయాలని ఆయన ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page