నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు
— నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేసేముఠా అరెస్ట్
— 1 కోటి 80 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
— నకిలీ విత్తనాలు అందుకే కఠిన చర్యలు – జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐ.పి.యస్
నల్లగొండ సాక్షిత ప్రతినిధి
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యస్.పి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమార్కులను పట్టుకుంటున్నారు. మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది వ్యవసాయశాఖ అధికారులు భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాదినం చేసుకొని వాటిని సరఫరా చేసే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 1 కోటి 80 లక్షల విలువ చేసే (10 వేల కిలోలు) 200 బస్తాల విడి విత్తనాలు ఒక్కొకటి (50 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యస్.పి అపూర్వ రావు కేసు కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని పక్కా సమాచారంతో నార్కట్ పల్లి పోలీసు స్టేషన్ యస్.ఐ. డి.సైదా బాబు, యస్.ఐ విజయ్ కుమార్, చిట్యాల యస్.ఐ. ఇరుగు రవి మరియు సిబ్బంది మరియు టాస్క్ ఫోర్స్, సిబ్బంది,నార్కట్ పల్లి ఫ్లై ఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న ఎర్టిగా కార్ నం. 39 AP BP 6345 గల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో రెండు బస్తాలలో విడి విత్తనాలు కలిగిన బస్తాలను పట్టుబడి చేసి వ్యవసాయ అదికారులను పిలిపించి చెక్ చేయగా అవి నకిలీ పత్తి విత్తనాలు అని తెలపగా వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగ వీరు చెప్పిన వివరాల ప్రకారం వీరు కర్ణాటక స్టేట్ లో కొంత మంది రైతుల దగ్గర నుండి పత్తి విత్తనాలు తక్కువ దరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచపల్లి దగ్గర స్టోరేజ్ చేసి అక్కడ నుండి మహారాస్త్ర లోని నాగపూర్ కి చెందిన రైతులకు ఏక్కువ దరకు అమ్ముటకు తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకొని రిమాండుకి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఒకరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని నిందితుల పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని అన్నారు. ఈ తరహా రైతులను మోసం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, నకిలీ విత్తనాలు అమ్మిన సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరియు పి. డీ.ఆక్ట్ పెడతామని హెచ్చరించారు. నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అన్నారు. ఈ నకిలీ పత్తి విత్తనాలను నేరస్థులు బిజీ 3 అని చెప్పగా ఇట్టి వాటిని పరీక్షల నిమిత్తం వ్యవసాయ అధికారుల ద్వారా డి ఎన్ ఎ సీడ్ టెస్టింగ్ లాబ్ మలక్ పెట్ కి పంపించి నిర్దారణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ హెర్బి సైడ్ టలారెన్స్ పత్తి విత్తనాలను జిఈఎసి నిషేదించబడినవని అన్నారు. వీటిని వేసుకోవడం వల్ల వాతావరణ కాలుష్యం మానవాళికి ఇబ్బందికరమని నిర్ధారించడం వల్ల ఈ యొక్క విత్తనాలను వాడి మోసపోవద్దని రైతులకి విజ్ఞప్తి చేశారు.
నిందితుల వివరాలు:
- గోరంట్ల నాగార్జున తండ్రి ప్రేమ్ చంద్, వయస్సు 43 సం.లు, కులం కమ్మ, వృత్తి బిజినెస్ పాగ్ అగ్రి నివాసం అల్వాల్ హిల్స్, సికింద్రాబాద్.
- గడ్డం రవీంద్రబాబు తండ్రి శ్రీనివాస్, వయస్సు 29 సం.లు, కులం కమ్మ, వృత్తి అగ్రి నివాసం మండలం పెద్దకూరపాడు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
- మెరిగే వేణు తండ్రి హుస్సేన్, వయస్సు 40 సం.లు, కులం ఎస్సీ మాదిగ, వృత్తి కూలీ, నివాసం గోసపాడు, నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి ఆద్వర్యంలో చిట్యాల సి.ఐ శివరాం రెడ్డి, నార్కెట్ పల్లి యస్.ఐ సైదా బాబు,చిట్యాల యస్.ఐ ఇరుగు రవి, యస్.ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్స్ శివ శంకర్, గిరిబాబు,మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని యస్.పి అబినందిచారు.