SAKSHITHA NEWS

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి

  • జయంతి వేడుకల్లో తిరుపతి మేయర్
    సాక్షిత, తిరుపతి: మన జాతీయ జెండాను రూపొందించి, దేశభక్తిని పెంపొందించిన పింగళి వెంకయ్యను స్పూర్తిగా తీసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా కోరారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి తో నివాళులు అర్పించారు. అన్నారు. అనంతరం జాతీయ జెండాను మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణలు ఆవిష్కరించి, ర్యా లీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ స్వాతంత్ర్య త్యాగధనుల స్పూర్తి ఈనాటి యువతకు మార్గదర్శకమని, స్వాతంత్ర్య సాధనకు ఉత్తేజం‌ కల్పించిన జాతీయ జెండాను రూపకల్పన చేసిన మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య అన్నారు. అందుకే మనందరికి ఆదర్శనీయుడని కొనియాడారు. కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ అజాదికా అమృత్ మహోత్సవ దేశభక్తి ఉత్సవాల్లో అందరం పాల్గొందామని, 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను దేశభక్తితో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరారు. మేయర్ డాక్టర్ శిరీషా కోరారు. విధ్యార్థుల్లో దేశభక్తి నింపే కార్యక్రమాలు, ప్రజల్లో ఉత్సహం నింపే ప్రజా ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎంఈ వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, రెవెన్యూ ఆఫిసర్లు లోకేష్ వర్మ, సేతుమాధవ్, డిఈ విజయకుమార్ రెడ్డి, సెక్రటరీ రాధిక, మేనేజర్ చిట్టిబాబు, ఏసిపి షణ్ముగం, మెప్మా వెంకటరమణ, శానిటరి ఎస్. చెంచయ్యలు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS