SAKSHITHA NEWS

దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో దుందిగాల్ మున్సిపాలిటీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎన్నికల ఇంచార్జ్ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో లోనే వేలమంది ఉన్నారు. ఆసరా, షాదీముబారక్, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ లాంటి సంక్షేమ పథకాలే మనకు తిరుగులేని విజయాన్ని అందిస్తాయి. కెసిఆర్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకు తిరిగి ఓటర్లకు వివరించాలని, వారితో పాటు లబ్ధిదారులను నేరుగా కలిసి ప్రచారం చేయాలని, గతంలో ఏ ప్రభుత్వం చేయని అభి వృద్ధి, సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని వివరిస్తూ
నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశాలు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,
పీ ఏ సీ ఎస్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మున్సిపల్ అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు, కౌన్సిలర్లు
సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమాను తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 01 At 7.06.00 Pm

SAKSHITHA NEWS