SAKSHITHA NEWS

మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా

-ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యాదు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో కిన్నెరసాని రోడ్డు నందుగల ముస్లిం స్మశానవాటికలో పందులను నిర్మూలించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా సోమవారం నాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కోరారు. ముస్లింలు స్మశానవాటికను పవిత్రంగా భావిస్తారని, ఇట్టి పవిత్ర స్థలంలో పందుల పెంపకందారులు పందులను పెంచుతున్నారని, దీని కారణంగా ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ నెల 23వ తేదీన పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు చనిపోయిన తమ కుటుంబ సభ్యుల సమాధులపై పుష్పగుచ్ఛాలు పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిం స్మశానవాటికలో పందులను శాశ్వతంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకొని శుభ్రం చేయించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరడంతో స్పందించిన కలెక్టర్ పాల్వంచ మున్సిపల్ కమిషనరుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. అంతేకాకుండా,
నెల 23వ తేదీన రంజాన్ పండుగ పురస్కరించుకొని జిల్లా లోగల 4 మున్సిపాలిటీలలో, 23 మండలాల పరిధిలో గల ఈద్ఘాల యందు టెంటులు, షామియానాలను ఏర్పాటు చేయడంతోపాటు శానిటేషన్, మంచినీటి సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరడంతో వెంటనే సంబంధిత అధికారులకు తగు చర్యలు చేపట్టేలా చూస్తాం అని అన్నారని తెలిపారు.


SAKSHITHA NEWS