ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విధంగా శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.