SAKSHITHA NEWS

మహబూబాబాద్ జిల్లా.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి
డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలి

కేసముద్రం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య

జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య

కేసముద్రం పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని తెలియజేసారు.వర్టికల్స్ వారీగా అధికారులు మరియు సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు.అనంతరం అధికారులు మరియు సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లొ డిఎస్పీ తిరుపతి రావు,రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్.ఐ మురళీధర్, సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Image 2024 08 12 at 17.34.39

SAKSHITHA NEWS