ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగిన పరిటాల శ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన

Spread the love

తొలిరోజు శివాలయంలో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు

మహిళలతో కలిసి విస్తృతంగా ప్రచారం

బాబు సూపర్ సిక్స్ పథకాల్ని జనంలోకి తీసుకెళ్లిన జ్ఞాన

పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తారు.. జ్ఞాన

ధర్మవరంలో ఊపందుకున్న ఎన్నికల ప్రచార పర్వంలోకి ఇప్పుడు పరిటాల శ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన కూడా దిగారు. తన భర్త తరఫున ప్రచారం చేసేందుకు జ్ఞాన పక్కా ప్రణాళికతో ధర్మవరంలో అడుగుపెట్టారు. ముందుగా 7వ వార్డులో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5గంటల నుంచి రుద్రాభిషేకంతో పాటు వివిధ రకాల పూజలు నిర్వహించారు. అనంతరం 7వ వార్డులోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలతో కలిసి పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మహిళలు మంగళహారతులతో జ్ఞానకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ ప్రవేశపెట్టిన బాబు సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ఇంటింటా తిరిగారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి మహిళల్ని కలుసుకుని సూపర్ 6 పథకాలను వివరించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ప్రతి నెల 1500 ఆర్థిక సాయం, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మకు వందనం వంటి పథకాల్ని వివరించారు. అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన వంటి వాటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. మరోవైపు ధర్మవరంలో చేనేతలను ఆదుకునేందుకు పరిటాల శ్రీరామ్ ఒక ప్రణాళిక రూపొందించారని చెప్పారు. మహిళలకు ఉపాధి కల్పించే విధంగా స్టిచ్చింగ్ యూనిట్స్ ను ధర్మవరం తీసుకొస్తారని జ్ఞాన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తారని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని పరిటాల జ్ఞాన తెలిపారు.

Related Posts

You cannot copy content of this page