SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు గాజులరామారం, సుభాష్ నగర్, సూరారం డివిజన్లకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు షాపూర్ నగర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా పలు మార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.