కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు .. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ మరియు ప్రజల సమస్యల తెలుసుకొనుటకు పాదయాత్ర ప్రారంభించారు.. ముందుగా వారి తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో ఓల్డ్ బోయిన్పల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వర్ణ ధామ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు… ముందుగా స్వర్ణధామ్ నగర్ లోని అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని అక్కడే ఆదేశాలు జారీ చేశారు..
ఇందులో ప్రధానంగా పెండింగ్లో ఉన్న రోడ్లు.. విద్యుత్ స్తంభాలు మరియు లైట్లుకు సంబంధించి అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలని ..ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించే విషయంలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు… సమతా నగర్ లో.. బస్సు ఏర్పాటు చేయవలసిందిగా కోరగా అలాగే వీధి కుక్కలు బెడద ఉందని ప్రజలు తెలియజేశారు.. అదేవిధంగా పివి ఎంక్లేవ్ వద్ద బహిరంగ ప్రదేశంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని దీనినీ అరికట్టాలని ప్రజలు కోరగా..
వెంటనే పోలీసులకు అక్కడ నిఘా పెంచాలని సూచించారు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. అలాగే వీధి కుక్కల బెడద దేశం మొత్తం అంతా ఉందని ఏదైనా చర్యలు తీసుకున్నామంటే బిజెపి ఎంపీ అయిన మేనకా గాంధీ వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని …వారిపై కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని.. దీన్ని ప్రజలు కూడా గమనించాలని అన్నారు… ఇలా ప్రతి కాలనీలో పర్యటిస్తూ అక్కడ ఉన్న డ్రైనేజ్ .
.రోడ్లు మంచినీరు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు చేశారు..అలాగే జరిగిన అభివృద్ధికి అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కు కృతజ్ఞతలు తెలిపారు…ఈ కార్యక్రమంలో బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో పాటు కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు మరియు డివిజన్ అధ్యక్షులు జిహెచ్ఎంసి అధికారులు అన్ని భాగాల అధికారులు పాల్గొన్నారు…
1 స్వర్ణ ధామనగర్ (వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుoడి )
2. రామరాజు నగర్
3. సమతా నగర్
4 . పి. వి ఎనక్లేవ్
5. గౌరీ నగర్
6. లక్ష్మి నరసింహ కాలనీ
7. మైత్రి వనం కాలనీ
8 . రామ్ రెడ్డి కాలనీ
9. శంకర్ ఎనక్లేవ్
10. ఆర్ ఆర్ నగర్
11. నారాయణపురి కాలనీ
12 . హెచ్ . ఎ . ఎల్ కాలనీ
సాయంత్రం 4 .30 లకు
1. ఆనంద కాలనీ
2. తిరుమల కాలనీ
3. నాగి రెడ్డి కాలనీ
4. ఆర్ ఆర్ టౌన్ షిప్
5. కళింగ ఎనక్లేవ్
6. బాలాజీ ఎనక్లేవ్ ( గాయత్రీ అపార్ట్మెంట్)
7. వల్లభ నగర్
8 . ఈద్గా
9 రామ కృష్ణ స్కూల్