సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్,వాంబేకాలాని H బ్లాక్ 1 వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉమన్న రావాలి సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది…
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆదితులుగా;-తెలుగుదేశం పార్టీ యువనాయకులు బొండా సిద్దార్ధ పాల్గొన్నారు
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ —
నిత్యావసర ధరలు పప్పు, ఉప్పు, సరుకులు అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి అని, తెలుగుదేశం ప్రభుత్వంలో ₹500 రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు ₹1500 వరకు వస్తుందని కూలి పనులు చేసుకునే వారు ఎలా కడతారని ప్రశ్నించారు,
2019లో ఒక్క ఛాన్స్ అని అనేకమైన అవాస్తవాలు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు 11నెలలు దాటినా ఈ ప్రజలకు చేసిందేమి లేదు అని ఒకపక్కన ప్రజలు అష్ట కష్టాలు పడి మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ఈరోజు తలకిందులు అయిపోయినటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందని,
ఎక్కడ చూసిన దోచుకోవడం దాచుకోవడం తప్పా ఈ వైసీపీ నేతలకు ఇంకొకా ధ్యాస లేకుండా పోయింది అని,ఇసుక బకాసురులు రాత్రికి రాత్రులు కనీసం అనుమతులు కూడా లేకుండా ఇసుకను రాష్ట్రాలను దాటిస్తూ కోట్లకు కోట్లు పడగెత్తుతున్నారు
అని అన్నారు….
ఈ కార్యక్రమంలో :- బొండా వంశీ మోహన్, దాసరి దుర్గారావు, దాసరి ఉదయశ్రీ, కోలా దుర్గారావు,ఆకుల సూర్య ప్రకాష్, అమ్మరావు,శివా పార్వతి జనసేన నాయకులు గణేష్, చరణ్, బాలాజీ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…