సాక్షిత : అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, రామారావు నగర్, హరి నగర్, బస్తిలలో నెలకొన్న పలు సమస్యలపై ఎలక్ట్రికల్ మరియు ఇతర సమస్యలపై కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ఎలక్ట్రికల్ మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేసి వారి సమస్యలు తెలుసుకుని తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, రామ్ రెడ్డి, జ్ఞానేశ్వర్, ఆవుల సంజీవ, శ్రీధర్, నరసింహ మాస్టర్, రాజశేఖర్ రెడ్డి, గోపాల్ సింగ్, మల్లికార్జున్, అమరేందర్, యోగి రాజు, శ్రీనివాస్ రెడ్డి, శేషారావు, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.