SAKSHITHA NEWS

రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్న బీజేపీ నాయకులను ఓడించడమే జగ్జీవన్ రామ్ కి మనమిచ్చే నివాళులు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్


సాక్షిత : బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా జగతగిరిగుట్ట బుద్ధ విహార్లో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సీపీఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షత వహించగా ఉమా మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం పూర్వం ఉన్న కుల అణిచివేత కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా డిప్రెస్సెడ్ క్లాసెస్ సంస్థను స్థాపించి అంటరానితనాని రూపుమపాలని,అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పించాలని కోరుతూ ఉద్యమాన్ని బాబు జగ్జీవన్ రామ్ పోరాడరని, అనంతరం ఉద్యమంలో పాల్గొనందుకు బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు కూడా పంపిందని అన్నారు.

స్వాతంత్య్రం అనంతరం అనేక సందర్భాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే నేను మంత్రిగా కొనసాగుతున్నానని అది అంబెడ్కర్ వల్లే సాధ్యం అయిందని చెప్పారని కానీ నేడు బ్రాహ్మణ అధిపత్యంలో ఉన్న బీజేపీ దళితులు,బీసీ లు ఎదిగి రాజ్యాంగ పదవులు అనుభవిస్తుంటే భవిష్యతులో ఈ దేశాన్ని బీసీ,ఎస్సీ,ఎస్టీలు స్వంతంగా పరిపాలించే స్థాయికి వస్తే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందనే కుట్రతో నేడు తెలివిగా రాజ్యాంగాన్ని మారుస్తాం అంటూ కొంతమంది తో ప్రచారం చెలిస్తుందని కావున ఇప్పుడు బీసీ,ఎస్సీ,ఎస్టీ లు అనుభవిస్తున్న గౌరవం,మర్యాద అలాగే ఉండాలంటే కచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ ని ఓడగొట్టాల్సిందేనని అన్నారు. 80 శాతంగా ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ లకేమో 50 శాతం రిజర్వేషన్లు రద్దుచేస్తామని చెపుతూ 5 శాతం కూడా లేని అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వెనుకాల బీజేపీ నాయకుల దుర్బుది తెలుస్తుందన్నారు.ధర్మం పేరుతో రాజకీయం చేస్తూ,అవినీతి పరుల వదిలేది అనుకుంటూ ప్రచారం చేస్తూ అదే అవినీతి పరులను చేర్చుకుంటు గురివింద గింజ సమేత చెపుతున్నారని కావున అబద్ధాల, కార్పొరేట్ వ్యాపారస్తుల బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడగొట్టడానికి సీపీఐ కార్యకర్తలు పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షుడు హరినాథ్,సీపీఐ సహాయ కార్యదర్శి దుర్గయ్య,కోశాధికారి సదానంద,జర్నలిస్ట్ నాయకులు వెంకట్,సీపీఐ నాయకులు సహదేవ్ రెడ్డి, ఇమామ్, సామెల్,మల్లేష్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 04 05 at 1.13.23 PM

SAKSHITHA NEWS