SAKSHITHA NEWS

మా నాయకులు కెసీఆర్ రూట్ మ్యాప్ లో రేవంత్ రెడ్డి నడవక తప్పదు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు నగరంలోని బిఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….

నూతన సంవత్సరం కానుకంటూ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జెబిఎస్ నుంచి శామీర్ పేట్ వరకు మెట్రోను ఫేజ్ -2బి పనులను చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

ఎందుకంటే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్ని రాష్ట్రాభివృద్ధి కుంటుపడే విధంగా తిరోగమనంలోకి తీసుకెళ్లిన నిర్ణయాలే.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదు. మేడ్చల్, శామీర్ పేట్ ప్రాంతాలకు డిపిఆర్ లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, ఈ మెట్రో విస్తరణను రెండవ ప్రాధాన్యతలో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో చేపట్టిన మెట్రో రైల్ నిర్మాణంలో కేంద్రం నుంచి ఒక రూపాయి అదనపు సాయం చేయకున్నా మెట్రోను పూర్తిచేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీది. కానీ నేటి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు నిధులు కేటాయించమని కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసి తప్పించుకునే ప్రయత్నంలా కనబడుతుంది.

హైదరాబాద్ నగరం నలుమూలల అభివృద్ధి చెందాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు జేబీఎస్ – షామీర్ పేట్ వరకు, ప్యారడైజ్ – కండ్ల కొయ వరకు మెట్రోను విస్తరించాలని కన్సల్టెంట్ సంస్థలకు పనులు అప్పచెప్పారు. ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పంటూ నార్త్ హైదరాబాద్ కు మెట్రోను రద్దు చేసింది.

ఉన్న నగరాన్ని విడిచిపెట్టి ఊహల నగరమైన ఫోర్త్ సిటీకి మెట్రోలు ఏ విధంగా వేస్తారని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. తిరిగి సంవత్సరం కాలయాపన అనంతరం గతంలో బిఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోనూ చేపట్టేందుకు డిపిఆర్లను సిద్ధం చేయాలని ఆదేశించడం కేసీఆర్ పారదర్శక పాలన తీరుకు నిదర్శనం.

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గతంలో తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తోంది. కెసిఆర్ రూట్ మ్యాప్ లో రేవంత్ రెడ్డి నడవక తప్పదు.

మా పార్టీ అధినేత కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచడంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధిపై కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి పరిచారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇగో ప్రాబ్లంతో రాష్ట్రాన్ని గత సంవత్సర కాలంలో హైడ్రా పేరుతో విధ్వంసక పాలన సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది.

మెట్రో ఫేస్ -2 విస్తరణలో భాగంగా వెస్ట్ హైదరాబాద్ – శంషాబాద్ ప్రాంతాలను కలుపుతూ సుమారు పది లక్షల మందికి సౌకర్యాన్ని కల్పించేందుకు గతంలో కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా రాయదుర్గం – శంషాబాద్ మార్గాన్ని కూడా తిరిగి ప్రారంభించాలి.

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ఎలివేటెడ్ కారిడార్ల పనుల్లో నేటికీ తట్టేడు మట్టి తీయలేదు. శంకుస్థాపన చేసి సంవత్సరమైనా ఇంకా పనులు చేపట్టకపోవడంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

నేను మారాను, మీరు మారండి అంటూ రేవంత్ రెడ్డి వారి మంత్రులకు, ఎమ్మెల్యేలకు హితభోద చేయడాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో విస్తరణలో భాగంగా శామీర్ పేట్, మేడ్చల్ రూట్లకు కావాల్సిన నిధులను కేంద్రంపై నెట్టివేసి తప్పించుకునే ధోరణితో కాకుండా ఈ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనేది నిర్దిష్టమైన కాల పరిమితిని ప్రజలకు తెలియజేయాలి.

ఇకనైనా ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలు కాకుండా ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.


SAKSHITHA NEWS