సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం : మైలవరం నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరాడంబరంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రతి గడపకు వెళుతూ వారికి జగనన్న సంక్షేమ పథకాల వల్ల చేకూరిన లబ్ది గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
మైలవరంలోని దేవుని చెరువులో సచిపాలయం-4-పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రజలు హారతులు ఇచ్చి శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేవుని చెరువులో రహదారుల నిర్మాణానికి రూ.80లక్షలు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.1.20 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. మరో రూ.40లక్షల పనులు టెండర్ల దశలో ఉన్నట్లు తెలిపారు. ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో దేవునిచెరువులో కేవలం ఒక్క రహదారి మాత్రమే నిర్మిస్తే, తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరు రహదారులు నిర్మించినట్లు వెల్లడించారు
నిరాడంబరంగా గడప గడపకు మన ప్రభుత్వం
Related Posts
మహిళ దారుణహత్య.
SAKSHITHA NEWS మహిళ దారుణహత్య. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగాల గుంటలో ఘటన. దాక్షాయిని (55) గా పోలీసులు గుర్తింపు. సింగాలగుంటలో నివాసముంటున్న తన,అక్క బావ గొడవలకు బావ తల్లి కారణమని అర్ధరాత్రి కత్తితో దాడిచేసిన విజయకృష్ణ. గాయపడిన దాక్షాయిని…
కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి?
SAKSHITHA NEWS కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి? కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. స్థానిక రైతు ఒకరు పంట రక్షణకు, పందులకు పెట్టిన వల ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి…