SAKSHITHA NEWS

ఒంగోలు ఊర చెరువులోని చేపల మార్కెట్ ఎదురు చెత్తను డంపింగ్ చేయడానికి ఆపాలి. సిపిఎం
ఒంగోలు నగరంలో ఊర చెరువులోని చేపల మార్కెట్ ఎదురు నగరంలో చెత్తను డంపింగ్ చేయటాన్ని సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించినది .ఈ సందర్భంగా సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జి. రమేష్ మాట్లాడుతూ నగరంలో చెత్తను ఊర చెరువులో డంపు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు చెత్త వల్ల దుర్వాసన వస్తుంది అక్కడ ఉండే మార్కెట్ వాసులకు మార్కెట్కు వచ్చిపోయే వారికి ఈ దుర్వాసన ఇబ్బందికరంగా ఉంది . వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దీనిని వెంటనే తొలగించాలని కార్పొరేషన్ అధికారులని డిమాండ్ చేశారు. గతంలో ఊర చెరువులో చెత్త వేసి దాన్ని లారీల ద్వారా ఎత్తివేసారు మరల చెత్త వేయొద్దని నిర్ణయించారు అయినా మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు చెత్తను డంపు చేయడం అంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది మున్సిపాలిటీ వారు ప్రజారోగ్యాన్ని కాపాడాలని జగనన్న ఆరోగ్య రక్ష పేరుతో ప్రచారం చేస్తున్నారో వారే అపరిశుభ్రం చేస్తే ప్రజల ఎవరిని అడగాలి దీనిని ఆలోచించాలని కోరారు. వెంటనే డంపింగ్ తొలగించాలని డిమాండ్ చేశారు. చెత్త ను దశ రాజు పల్లి డంపింగ్ యార్డుకు తరలించాలని కోరారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నగర మారెళ్ళ సుబ్బారావు. కమిటీ సభ్యులు టి. మహేష్ బండ్ల మిట్ట శాఖ కార్యదర్శి పసుపులేటి నరసింహారావు. పాప ని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు
ధన్యవాదములు
జి రమేష్ సిపిఎం నగర కార్యదర్శి.


SAKSHITHA NEWS