పోరాటం కోసం మేము సైతం

Spread the love

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కి నిరసనగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అని గౌడ సామాజిక వర్గం నాయకులు రిలే నిరాహార దీక్ష చెప్పటారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామరావు విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సర్ధార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూల మల వేసి నివాళులర్పించారు. ఈ రిలే నిరాహార దీక్షకు గౌడ సామాజిక వర్గంనాయకులు, కల్లుగీత కార్మికులు దీక్ష లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

గీత కార్మికుల కార్పొరేషన్ ద్వారా 4ఏళ్ళ పాలనలో బడ్జెట్ కేటాయించ లేదు గత తెలుగుదేశం ప్రభుత్వం లో గీత కార్మికుల కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. విదేశీ విద్య ద్వారా గీత కార్మికుల బిడ్డలను కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు పంపారు

టిడిపి ప్రభుత్వం లో గీత కార్మికుల చెట్టు పన్నుకోడా రద్దు చేసారు

చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ఆలోచనలు కలిగిన ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు

వైసిపి పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని, ఇంతటి క్రిమినల్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం అన్నారు. ఏం తప్పు చేశారని చంద్రబాబు ని జైలుకు పంపారని ప్రశ్నించారు

ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే వారిని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలపై ప్రతిరోజు కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నారని అన్నారు

రాబోయే ఎన్నికలలో ఓడిపోతామనే భయం తో వైసిపి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు

జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు

ఈ కార్యక్రమములో గౌడ సామాజిక వర్గం నాయకులు, కల్లుగీత కార్మికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page