SAKSHITHA NEWS

సాక్షిత : స్వాతంత్ర్య సమరయోధుడిగా,సంఘసంస్కర్తగా,తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 37వ వర్దంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ లో గౌరవ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ నార్నె శ్రీనివాస రావు, మాజీ కార్పోరేటర్ మాధవరం రంగరావు తో కలిసి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి , మరియు డాక్టర్ BR అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా ,సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా౹౹ బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప దార్శనికుడు అని, ఆయన సేవలు దేశము కోసం పడిన తపన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని, ఆత్మ విశ్వాసమే ఆయుధం గా దళితుల అభ్యున్నతి కోసం మరియు అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడు  , అఖండ   భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన  స్వతంత్ర సమర యోధులు   ఈ తరం ప్రజలకు ఆదర్శప్రాయం ఆయన జీవితం  అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.

అదేవిధంగా ఆదర్శవంతులు, నిబద్ధత సచ్చీలత, దళిత జనోద్ధరణ కృషీవలడు, స్వేచ్చ సమానత్వం, సామాజిక న్యాయం సౌభ్రాతుత్వం పై దేశ ప్రజలను చైతన్యం చేసి, నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానాలను అధిరోహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ పరిపాలన దక్షత అనుభవాలు, సామాజిక న్యాయం కోసం ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని. అలాగే చిన్న రాష్ట్రాల ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని Dr. BR అంబేడ్కర్ రాజ్యాంగంలో చేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. మహనీయుల ఆశయాలు నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రదాత ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నారని. అలాగే ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ ఆశయ సాధన కృషి చేయాలని,అదేవిధంగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన జీవిత ఆశయాల సాధన కోసం అందరం పునరకితం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, జిల్లా గణేష్, రాజేష్ చంద్ర, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, జాన్, కైసర్, అగ్రవాసు, సంగమేష్, రాములుగౌడ్, యాదగిరి, రవీందర్, మహేష్, ముజీబ్, ఇంతియాజ్, సంతోష్ బిరాదర్, కటికరవి, శామ్యూల్, వాలి నాగేశ్వరరావు, ఉమేష్, కూర్మయ్య, పుట్టం దేవి, సావిత్రి, ప్రీతి, రేణుక, సురేఖ, వెంకటలక్ష్మి, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS