ఏప్రిల్ 14 న భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ హఠావో-దేశ కో బచావో పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భంగా జగతగిరిగుట్ట కార్యాలయం ఎదురుగా పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగటుతూ ఇంటి ఇంటికి సీపీఐ పేరుతో కరపత్రాలను పంచుతూ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర, జీపు జాతా,ర్యాలీలను నిర్వహిస్తున్నామని కావున ప్రజలు, మేధావులు, యువకులు, కళాకారులు ఈ యాత్రలను జయప్రదం చేయాల్సిందిగా కోరారు.
ఈ యాత్రల సందర్భంగా ప్రజలకు వాస్తవాలను తెలియచేస్తూ,ప్రజల సమస్యలను తెలుసుకుంటు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాదిమంది డబల్ బెదరూమ్ కొరకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వకపోవడం, కట్టిన ఇండ్లన్నీ పాతబడిపోవడం, అక్కడక్కడ కిటికీలు,డోర్లు మాయమయ్యాయని ఇప్పటికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే పోలీస్ బందోబస్తుతో అరెస్టు చేయించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు అవే స్థలంలో కబ్జాదారులు లక్షలకు పేద ప్రజలకు అమ్ముకొని ఇండ్లను కట్టితే మాత్రం ఎందుకు ఉరుకున్నారని, అధికారులు,ప్రజా ప్రతినిధులు పేద ప్రజల వెనుక ఉండకుండా కబ్జాదారుల వెనుక ఉన్నట్లు ఉందని కావున సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రల సమయంలో ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేని వారిని గుర్తించి పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య,శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి,సీపీఐ నాయకులు సి.వెంకటేష్ రాములు, ఇమామ్,నగేష్ చారి,మల్లేష్,బాబు,నారాయణ,అంజయ్య, యువజన సంఘం నాయకులు శ్రీకాంత్, బాబు, అరవింద్, శేఖర్,మహిళా సమాఖ్య నాయకురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.