గణేష్ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి ఎనిమిది డివిజన్లలో గణేష్ వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగే గణేష్ వేడుకల్లో భాగంగా నిమజ్జనం జరిగే చెరువుల వద్ద చిన్నారులకు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్, నీటి సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి ఉత్సవాల్లో ఏ ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన గణేష్ ప్రతిమలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో డీసీలు మంగతాయారు, ప్రశాంతి, అల్వాల్ డీసీ నాగమణి, ఎస్సీ చెన్నారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్ గౌడ్, అల్వాల్ ఈఈ రాజు, ట్రాఫిక్ సీఐలు చంద్రశేఖర్, రాజు మరియు లా&ఆర్డర్, ఇంజనీరింగ్, శానిటేషన్, హెల్త్, టీఎస్పిడిసీఎల్, రెవెన్యూ, ఫైర్, ఇరిగేషన్, మెగా ఇంజనీరింగ్, రాంకీ సిబ్బంది, నియోజకవర్గ యూత్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సోమేష్ యాదవ్, వార్డు సభ్యుడు సుధాకర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
గణేష్ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…