SAKSHITHA NEWS

చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

…….

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా స్థానిక కాల్వఒడ్డు, నయాబజార్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి చెక్ పోస్ట్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తణిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని అన్నారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. సిసి కెమెరా ల ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల తనిఖీ సంబంధించి రిజిస్టర్‌ను నిర్వహించాలన్నారు. ప్రతి చెక్‌ పోస్ట్‌ లో వీడియోగ్రఫీ కి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అప్రమత్తంగా వుంటూ, 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ తహశీల్దారు సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2024 03 18 at 5.30.33 PM

SAKSHITHA NEWS