నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య గణనీయంగా పెరిగిందని వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు అన్నారు.
దుప్పిని వేటాడడం చట్టరీత్యా నేరమని అన్నారు. దోపిని వేటాడే వారిని వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.