NTR is the pride of the Telugu nation
తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు దుర్మార్గమైన చర్యని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు తీవ్రంగా ఖండించారు.స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రతిష్టాత్మకంగా హెల్త్ యూనివర్సిటీని అన్న నందమూరి తారకరామారావు గారు ఏర్పాటు చేశారు అని గుర్తు చేశారు.ఎన్టీఆర్ గారి పేరు తొలగింపు పై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే సిగ్గుపడాలి అన్నారు.విష జ్వరాలు, రోగాలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కళ్ళు ఉండి పట్టించుకోని ఈ గుడ్డి వైసీపీ ప్రభుత్వం ఉన్న పేర్లను తొలగించి వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని చూడటానికి సిగ్గుండాలి అన్నారు.
మీకు చేతనైతే నూతనంగా యూనివర్సిటీలు తీసుకొనిరండి అంతే గాని ఇలా చేతకాని పనులు చేయడం రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు త్వరలోనే మీకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.151 సీట్లు ఉన్నాయనే అహంకారం, అధికార మదంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకుంటున్నారని పేర్కొన్నారు.ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుతో జగన్ రెడ్డికి పోయే కాలం దాపురించిందన్నారు.హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి,లేనిపక్షంలో దీని పై తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
అలాగే నరసరావుపేట పట్టణంలో కోట్లాది రూపాయలు ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుదే అని అన్నారు.వాటికి ఎన్టీఆర్,చంద్రబాబు,కోడెల పేర్లు పెడితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ల పేర్లు తీసివేసి తాను అభివృద్ధి చేసినట్లుగా వైఎస్ఆర్,గోపిరెడ్డి పేర్లు పెట్టుకొని సంతోషపడుతున్నారని ఇవ్వన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఇది తెలుసుకొని మెలగాలిని కోరారు.కోడెల శివప్రసాదరావు స్టేడియానికి పేరు మార్చడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.