సిట్ కాదు… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కావాల్సిందే
సాక్షిత : టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. ఒకటి కాదు… అరడజను ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టమైపోయింది. రోజుకో దారుణం బట్టబయలవుతోంది. ఇద్దరితో మొదలై 20 మందికి చేరింది… పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. ఆరోపణల గురించి ప్రస్తావించ కూడదట. అన్యాయాన్ని నిలదీయకూడదట. సమాధానం చెప్పమని పిలిచింది. వెనక్కు తగ్గేదే లేదు. సిట్ కు సమాధానం చెబుతా… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా.