SAKSHITHA NEWS

Non-stop ‘Pathan’ collection festival.. within 4 days Rs. 400 crores record

ఆగని ‘పఠాన్’ వసూళ్ల పర్వం.. 4 రోజుల్లోనే రూ. 400 కోట్లతో రికార్డు

ఈ నెల 25న విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం

రోజుకు వంద కోట్లతో దూసుకెళ్తున్న వైనం

వేగంగా రూ. 400 కోట్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా ఘనత

బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. పలు వివాదాలను దాటుకొచ్చి జనవరి 25న విడుదలైన ఈ చిత్రం రోజుకు వంద కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల వసూళ్లు సాధించింది. దాంతో వేగంగా 400 కోట్ల క్లబ్ చేరిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. 

భారత బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 200 పైచిలుకు కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది.

ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే తొలి వారాంతంలోనే ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.

 

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్రలో కనిపించాడు….