SAKSHITHA NEWS

Newly established NSR Multi Specialty Hospital in Warangal Arepally

వరంగల్ ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన NSR మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మేల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా zp మాజీ చైర్మన్ సాంబారి సమ్మా రావు లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

సీఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారు.

వైద్య విద్య, వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు

జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు

హైదారాబాద్ నగరం కు నాలుగు దిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు ఏర్పాటు అవుతున్నాయి

గతంలో ఎన్నడూ లేనంతగా వైద్య, ఆరోగ్య శాఖకు భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి

వరంగల్ లో ఐటీ, టెక్స్టైల్స్ పర్కులు ఏర్పాటు అవుతున్నాయి

పారిశ్రామికంగా బాగా అభివృద్ధి జరుగుతున్నది

వరంగల్ ను హెల్త్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నారు

11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అవుతున్నది.

ఇప్పటికే mgm హాస్పిటల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచిన ఘనత సీఎం కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది

SSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు అయ్యింది

అత్యాధునిక వైద్య సదుపాయాలు వరంగల్ లో ఉన్నాయి

ప్రభుత్వ వైద్య0 పై ప్రజలకు నమకం పెరిగింది.

అయినా, పెరుగుతున్న జనాభా, వైద్య సంస్థల దృష్ట్యా ప్రైవేట్ వైద్యం కూడా బాగానే నడుస్తున్నది

ప్రైవేట్ వైద్యం కు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నది

ప్రైవేట్ వైద్యులు,యాజమాన్యాలు వైద్యాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా తత్పరత తో చూడాలి

పేదలు సైతం ఖర్చు పెట్టగలిగే వైద్యాన్ని అందించాలి

పేదలకు కొంత మేర ఉచిత వైద్యం అందించాలి

వరంగల్ లో ఇప్పటికే అనేక హాస్పిటల్స్ ఏర్పడ్డాయి

అవన్నీ బాగానే నడుస్తున్నాయి

NSR హాస్పిటల్ కూడా బాగా నడవాలని కోరుకుంటున్నాను

NSR హాస్పిటల్ వాళ్ళు అపోలో హాస్పిటల్ తో టై అప్ అయ్యారని చెబుతున్నారు కాబట్టి, మంచి వైద్యం అందే అవకాశాలు ఉన్నాయి

NSR హాస్పిటల్ బాగా నడవాలని ఆకాంక్షిస్తున్నా.

యాజమాన్యానికి శుభాకాంక్షలు!

ఈ సందర్భంగా ఎమ్మేల్యేలు హాస్పిటల్ లోని వివిధ విభాగాలను ప్రారంభించారు.


SAKSHITHA NEWS