నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని MLC శంభిపూర్ రాజు కి వినతి….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని బొడ్డురాయి నుండి ప్రగతినగర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ వరకు గల రోడ్డు చాలా సంవత్సరాల క్రితం వేయబడింది. ప్రస్తుతం పడుతున్న వర్షాల కారణంగా పూర్తిగా చెడిపోయి, వాహన దారులకు, స్కూల్ పిల్లలకు, మరియు అన్ని రకాల పనులకు వెళ్లే ప్రయానికులందరికి చాలా ఇబ్బంది కరంగా మారడంతో నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపెట్టవలసిందిగా భౌరంపేట్ గ్రామ నాయకులు మేడ్చల్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు కి వినతిపత్రాన్ని అందచేసారు. స్పందించిన MLC త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , బుచ్చిరెడ్డి , మురళీ యాదవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని MLC శంభిపూర్ రాజు కి వినతి….
Related Posts
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…