అధికారుల నిర్లక్ష్యం, కబ్జాదారుల ఇష్టారాజ్యం,పేద ప్రజలకు శాపం.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
అసలే మట్టి రోడ్డు ఆపైన వర్షాలకు నీళ్లు పారుతు ప్రజల రాకపోకలకు ఇబ్బందిపడుతుంటే గాజులరామరంలో కబ్జాదారులు క్వారీలను అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద తిప్పర్ల ద్వారా అధిక లోడ్డు తో వెళ్లడం వల్ల రోడ్లు ద్వంసం అవుతున్నాయి. దీనికి ఉదాహరణ ఈ రోజు గలిపోచమ్మ బస్తీలో రాత్రి తిరిగిన టిప్పర్ల వల్ల రోడ్డు బురుధమయం కావడం వల్ల స్కూలుకు వెళ్తున్న పిల్లలు పడిపోవడంతో తీవ్ర గాయలై ఆసుపత్రికి వెళ్లడం జరిగింది.ప్రజలు కబ్జాదారులను అడిగే ధైర్యం లేకపోవడం,అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల మరింత రెచ్చిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కబ్జాదారులు నేడు మరింత బహిరంగంగా కబ్జాలు చేస్తున్నారు.
ఈ విషయం పై గతంలో అధికారులను అడిగితే
ఎమ్ ఆర్ ఓ ని అడిగితే పోలీస్ ప్రొటెక్షన్ కు అడిగమని,
పోలీస్ అధికారులను అడిగితే ఎమ్ ఆర్ ఓ నుండి ఎటువంటి కంప్లైంట్ రాలేదని సమాధానాలు వస్తున్నాయే తప్ప ప్రభుత్వ భూమి మాత్రం కాపాడబడటం లేదని అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉన్న ప్రభుత్వ భూమి మొత్తం కబ్జాలు పాలవుతుందని కావున అధికారులు నిర్లక్ష్యం ను, కబ్జాదారుల పై ఒకవేళ ప్రేమ ఉంటే తీసివేసుకొని వెంటనే కబ్జాలను తొలగించాలని లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కూడగట్టి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.