జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని అక్టోబర్ 5
కలెక్టర్ అనుమతి తీసుకున్న రెడ్ క్రాస్ సొసైటీ
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ నందు ప్రతి సంవత్సరం జరుపుకొంటున్న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని అక్టోబర్ 1న కాకుండా అక్టోబర్ 5 న జరుపుకొనుటకు కలెక్టర్ ను అనుమతి కొరకు బ్లడ్ సెంటర్ అడ్వైసర్ మలిరెడ్డి కోటారెడ్డి, కన్వీనర్ సి. హెచ్. అజయ్ బాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.యశోవర్ధన్ వారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ని కలిసి అనుమతి తీసుకుని కలెక్టర్ ని కార్యక్రమానికి ఆహ్వానిచడం జరిగింది. అనంతరం బ్లడ్ సెంటర్ నందు చేస్తున్న వివిద కార్యక్రమాలను గురించి తెలియచేయడం జరిగింది.
