ఉపరాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి

Sakshitha news

ఉపరాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి

  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

ఈనెల 24వ తేదీ భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ ఆలయ ఈవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పటిష్ట భద్రతతో పాటు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకడంతో, అమ్మవారి దర్శనానికి చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఆలయ ఈవో వీకే శీనా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
(ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ నుంచి జారీ)