కాంగ్రెస్ ప్రభుత్వం లో సుంకవల్లి కి దక్కిన అత్యంత గౌరవం
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావుకి తెలంగాణ ప్రభుత్వం ఆత్మ చైర్మన్ గా నియమించిన సందర్బంగా, హైదరాబాద్ పర్యటన ముగించుకొని అశ్వారావుపేట చేరుకోగా వారి నివాసంలో శాలువాతో సన్మానించి, వేదాంతపురం కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
వేదాంతపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కూన చిన్నారావు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగీత సత్యనారాయణ, కూన దుర్గరావు, పైడి లవరాజు, తదితరులు పాల్గొన్నారు
