తిరుపతి పార్లమెంట్ టీడీపీ కార్యాలయం ప్రారంభం
** పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్, మాజీ మంత్రి సోమిరెడ్డిలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ అండ్ తిరుపతి టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అతిథులతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యే లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, సీనియర్ నేత మబ్బు పెద్దబ్బ, ఊట్ల సురేంద్ర నాయుడు, కార్పొరేషన్ డెప్యూటీ చైర్మన్ ఆర్.సి.మునికృష్ణ, గంగమ్మగుడి చైర్మన్ నైనారు మహేష్, మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మలు కూడా పాల్గొన్నారు.
కార్యాలయానికి విచ్చేసిన తుడా ఛైర్మన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు పూర్ణకుంభంతో, గజమాలలతో ఘనస్వాగతం పలికారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి, నూతన కార్యాలయంలోనికి అడుగుపెట్టిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు.
ఈ కార్యక్రమంలో తెదేపా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, పలువురు కార్పొరేషన్ చైర్మన్ లు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY