SAKSHITHA NEWS
Narsa Reddy Bhupathi Reddy participated campaign.
సాక్షిత  :  మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  మర్రిగూడ మండలంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి  మరియు ఎడవెల్లి కృష్ణ తో కలిసి  ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టిపిసిసి  ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు  నర్సారెడ్డి భూపతిరెడ్డి.


ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి  మాట్లాడుతూ పాల్వాయి స్రవంతి  హస్తం గుర్తుపై అందరూ ఓటు వేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని, డబ్బు అహంకారంతో విర్రవీగుతున్న రెండు పార్టీల అభ్యర్థులకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.



ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆనంద్ రావు , నర్సింహా గౌడ్, వెంకటేష్,శ్రీకాంత్ మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.