SAKSHITHA NEWS

పంచుమర్తి అనూరాధ గారికి శుభాకాంక్షలు:నరేంద్ర వర్మ

బాపట్ల నియోజకవర్గంలో అంబరాన్ని అంటిన సంబరాలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పంచుమర్తి అనూరాధ గారికి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయం అనంతరం పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో నరేంద్ర వర్మ గారు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయోత్సవ వేడుకలు జరిపారు.. స్వీట్స్ పంచి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విజయం వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలతో పాటు వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని నిరూపించినట్టు ఉంది అని నరేంద్ర వర్మ..రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని నరేంద్ర వర్మ గారు ధీమా వ్యక్తంచేశారు.


SAKSHITHA NEWS