It is Narendra Modi who is doing injustice to SCs, STs and OBCs
ఎస్సీలు, ఎస్టీలు, ఒబీసీలకు అన్యాయం చేస్తోంది నరేంద్ర మోడీయే..
…..
సాక్షిత : ఈడబ్లూఎస్ లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తాం.
ఈడబ్లూఎస్ లో ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ లను అవకాశం కల్పించకుండా అన్నివర్గాల ప్రజలకు మోడీ అన్యాయం చేశారు.
హిందువులతో పాటు, ప్రధానంగా ముస్లింలు కూడా ఈడబ్లూఎస్ రిజర్వేషన్ లబ్ది పొందుతున్నారు..
పదేళ్ల పాలనలో మోడీ హిందూ సమాజానికి ఏవిధమైన మేలు చేయలేదు..
రామమందిర నిర్మాణం న్యాయ వ్యవస్థ తీర్పుకు అనుగుణంగానే నిర్మించారు.
ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎం పి అభ్యర్థి, తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా, మత విద్వేషాలు రెచ్చ గొట్టే లా మాట్లాడుతున్నారు.
సమాజాన్ని చిల్చెలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిదే భారతీయ జనతా పార్టీ అని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై మొసలి కన్నీరుకారుస్తూ అన్యాయం చేస్తోంది బిజెపి.
సామాజికంగా వెనకబడిన వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను మోడీ కాలరాస్తున్నరు.
ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగా 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్లూఎస్ లో సామాజికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, ఒబీసీలను తొలగించారు.
బలహీన వర్గాల హక్కులు కాలరాసే విధంగా ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లను ఈడబ్లూఎస్ రిజర్వేషన్ నుండి తొలగించారు.
ముస్లిం లకు రిజర్వేషన్ కల్పిస్తుంది బిజెపి..
ఈ డ బ్లూ ఎస్ కింద ఎక్కువగా ముస్లిం లే రిజర్వేషన్ పొందుతున్నారు.
ఎస్సీ ఎస్టీ లు, బీ సీ లకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అంటూ అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తోంది నరేంద్ర మోడీ.
కాంగ్రెస్ పార్టీ సామాజిక వెనక బాటు తనం పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ కల్పించింది అని గుర్తు చేశారు.
బిజెపి ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగా ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కల్పిస్తోంది.
మోడీ ఆలోచన పెట్టుబడి వర్గాలకు కొమ్ముకాసెలా ఉంది..
హిందువుల మెప్పు పొందేందుకు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అంటున్నారు.
ఆర్థికంగా వెనకబడిన కులం, మతం బేదభావం లేకుండా ఇప్పటికైనా ప్రధాని మోడీ ఈ డ బ్లూ ఎస్ లో అందరికీ అవకాశం కల్పించాలి అని జీవన్ రెడ్డీ డిమాండ్ చేశారు.
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈ డ బ్లు ఎస్ రిజర్వేషన్ లో మార్పులు చేస్తుంది.
ఈ డ బ్లూ ఎస్ కేటగిరీ నుండి
దూరం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ఇండియా కూటమి ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ కేటగిరీ లో అవకాశం కల్పిస్తాం.
1986 లో అప్పటి ప్రధాన మంత్రి
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా
అయోధ్య రామాలయం తలుపులు తెరిచారు.
1989 లో శిలా న్యాస్ చేశారు
న్యాయ వ్యవస్థ తీర్పు కు అనుగుణంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించబడింది.
ఇది ఎవరికీ ఘనత కాదు..అని జీవన్ రెడ్డీ స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కు కెసిఆర్ పూర్తి బాధ్యుడు.. కెసిఆర్ కుప్పకూలడానికి స్వయంకృపాదికారమే అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.