నూతన డివిజనల్ పి.ఆర్.ఓ.గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరావు సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం కార్యాలయంలో నూతన డివిజనల్ పి.ఆర్.ఓ.గా డి. నారాయణరావు సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంత వరకు విజయనగరంలో ఏపీఆర్వోగా పని చేసి పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జునను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణరావును సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ వి. మణిరామ్ అభినందించారు. ఇతర అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.