ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామ

Spread the love

హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఖమ్మం జిల్లా నేతల సమావేశంలో ప్రకటించిన కేసీఆర్

పార్టీ శ్రేణుల హర్షం – వాడవాడలా సంబురాలు

అంతా ఊహించినట్లే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు పేరును కేసీఆర్ ఖరారు చేశారు. హైదరాబాద్ లో పార్టీ ఖమ్మం జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించి, ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా రెండు సార్లు అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన నామ నాగేశ్వరరావు 2009, 2019 లోక్ సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో సునాయాసంగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పై 1 లక్షా 68 వేల 62 ఓట్ల భారీ మెజార్టీ తో ఖమ్మం ఖిల్లాపై విజయకేతనం ఎగురవేశారు . ఆ తర్వాత నుంచి పార్టీ లోక్ సభా పక్ష నేత గా లోక్ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల వాణిని బలంగా వినిపిస్తూ తనదైన శైలిలో ప్రజల మద్దతుతో ముందుకు దూసుకుపోతున్నారు. 2005 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న నామ బీఆర్ ఎస్ లో 2019 మార్చి లో జాయిన్ అయి పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలిచి, ప్రత్యర్థి పార్టీపై ఘన విజయం సాధించారు. పూర్వ వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం బలపాల గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో నామ ముత్తయ్య, నామ వరలక్ష్మి దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు. పారిశ్రామిక వేత్తగా బహుముఖంగా రాణించిన నామ నాగేశ్వరరావు రాజకీయాల్లో కూడా తన మార్క్ రాజకీయంలో దూసుకెళుతూ తనదైన ముద్ర వేశారు. పార్లమెంట్ సభ్యునిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన నామ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు గురించి లోక్ సభలో పెద్ద ఎత్తున గళం వినిపించారు. కేసీఆర్ , కేటీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ కేంద్రంగా అవిశ్రాంతంగా పోరాడుతూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని మళ్లీ ఇప్పుడు ఖరారు చేశారు.నామ అయితేనే అందర్నీ కలుపుకుపోయి సునాయాసంగా ప్రత్యర్థిపై ఘన విజయం సాధిస్తారని కేసీఆర్ బలంగా విశ్వసించినట్లు భావిస్తున్నారు.

హర్షం – సంబురాలు

నామ నాగేశ్వరరావు పేరును ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ప్రకటించడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షద్వానాలు వ్యక్తమవుతు న్నాయి. అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు , పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబు రాలు చేసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నామను అత్యధిక బంపర్ మెజార్టీతో గెలిపించు కుంటామని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నాయి.

Related Posts

You cannot copy content of this page