నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి కల్యాణ మహోత్సవం

SAKSHITHA NEWS

Nallagutta Sri Lakshmi Narsimha Swamy Kalyana Mahotsavam

నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ .


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంద్రసేన గుప్తా, యాదగిరి, శ్రీరాములు, యాం సాగర్, సురేష్, నర్సింహారెడ్డి, లక్ష్మణ్, సంజీవరెడ్డి, నరసమ్మ, కావలి శ్రీనివాస్, శంకర్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page