నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

Spread the love

కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు

  • జగన్ రెడ్డి అసమర్థత, వైసీపీప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో ‘ఆరోగ్య విపత్తు’ తలెత్తింది.
  • గుంటూరు నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలుషిత తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి
  • కలుషిత మంచినీరు తాగి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది చనిపోయారు.
  • వేలమంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
  • వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీకి తన శాఖలో ఏంజరుగుతోందో తెలియడంలేదు.
  • కలుషిత నీటి వల్ల సంభవించిన మరణాలపై తనను ప్రశ్నించిన మీడియావారిపై చిందులేయడం ఆమె అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
  • గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ ఏం చెప్పారో మంత్రికి తెలియదా?
  • రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించే పరిస్థితి వస్తే, అప్పుడు ఆదుకుంటామని మంత్రి అనడం ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యవైఖరికి నిదర్శనం.
  • గుంటూరులో తలెత్తిన కలుషిత నీటి సమస్యకు వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణం.
  • వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి ట్యాంకుల నిర్వహణ..నీటి సరఫరా అధ్వాన్నంగా తయారైంది. నక్కా ఆనంద్ బాబు (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి)

జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు తాగి అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది మరణించినట్టు చెబుతున్నారని, అనారోగ్యంతో వేలమంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారని, కలుషిత నీరు తాగి గుంటూరులో ఇద్దరు చనిపోయి, ప్రభుత్వాసుపత్రి లో 20మందికి పైగా చికిత్స పొందుతుంటే, ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని, ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడి, మీడియావారిపై చిందులేశారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం….!

గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలయ్యారని చెబుతుంటే, ఎవరు చెప్పారంటూ మంత్రి రజనీ మీడియాపై చిందులేయడం ఆమె అవగాహనా రాహిత్యానికి నిదర్శనం

“ కలుషిత నీరు తాగి చనిపోయారని, 20మందికిపైగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గుంటూరు సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ స్వయంగా చెప్తే, మంత్రి విడదల రజనీ కలుషిత నీటి వల్లే చనిపోయారని మీరెలా చెబుతారంటూ తనను ప్రశ్నించిన విలేకరులపై చిందులేయడం ఆమె అవగాహన రాహిత్యానికి నిదర్శనం. క్షేత్రస్థాయిలో తన శాఖలో ఏంజరుగుతోందో అప్పుడప్పుడు అయినా సమీక్షలు చేస్తే మంత్రులకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రశ్నించే వారిపై, ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం తప్ప మంత్రులకు తమ శాఖల్లో జరిగే విషయాలు పట్టడంలేదు. కలుషిత నీరు తాగి పేదలు చనిపోతుం టే ముఖ్యమంత్రి తనకు సంబంధం లేదన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిం చడం నిజంగా బాధాకరం. తన సంపాదన కోసం జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అమ్మిస్తున్న కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని, వేలమంది పేదలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రుల్లో చేరుతున్న ఉదంతాలు ఇప్పటికే ఎక్కువయ్యాయి. అవి అలా ఉండగానే ఇప్పుడు కలుషిత నీరు తాగి ఏకంగా ప్రజల ప్రాణాల మీదకు వస్తున్న దుర్ఘటనలు చూస్తుంటే వైసీపీప్రభుత్వం లో పేదల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని తేలిపోయింది.

హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించే పరిస్థితి వస్తే ప్రజలకు అండగా ఉంటామని మంత్రి చెప్పడం సిగ్గుచేటు
పేదల నుంచి అందినకాడికి దండుకోవడంపై ఉన్న శ్రద్ధలో ఆవగింజంత కూడా ఈ ప్రభుత్వం వారి ఆరోగ్యరక్షణపై పెట్టడం లేదు

గుంటూరు నగరంతో పాటు, రాష్ట్రంలోని పలు ప్రధాననగరాల్లో అతిసార బాధితు లు ఎక్కువయ్యారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించే పరిస్థితి వస్తే అప్పుడు ప్రజలకు అండగా ఉంటామంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాటలు, ప్రజారోగ్యంపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యవైఖరికి నిదర్శనాలు కావా? ప్రజల ప్రాణాలు పోతుంటే, వైద్యారోగ్య శాఖతో పాటు, మున్సిపల్ శాఖ చోద్యం చూస్తున్నాయి. కలుషిత తాగునీటి సమస్య రాష్ట్రమంతా ఉంది. డ్రైనేజ్ లలోని మురుగునీరు, తాగునీటి పైపులైన్లలో కలుస్తుంటే ప్రభుత్వంలో చలనంలేదు. మున్సిపాలిటీలు, పంచాయతీలకు సంబంధించిన రూ.14వేలకోట్లను దారిమళ్లిం చడంపై చూపిన శ్రద్ధలో పావువంతు కూడా జగన్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై చూపడం లేదు. కేవలం రూ.350 లకు లభించే కొళాయి సెట్ కు ప్రభుత్వం రూ.1300 లు వసూలు చేసింది. పేదలనుంచి అందినకాడికి వసూలుచేయడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధలో ఆవగింజంతకూడా వారికి సురక్షితమైన మంచినీరు అందించడంపై, వారి ఆరోగ్యరక్షణపై లేదు. టీడీపీ ప్రభుత్వంలో రూ.500 కోట్లతో గుంటూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించాము. మా హాయాంలోనే ఆ పనులు 90 శాతం పూర్తయ్యాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పనుల పురోగతి ఏమిటో కూడా తెలియనిదుస్థితి. టీడీపీ ప్రభుత్వంలో నెలకోసారి తాగునీటి రిజర్వాయర్లు, ట్యాంకులు శుభ్రపరిచేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక మంచినీళ్ల ట్యాంకుల ముఖం చూసే వారు కూడా లేకుండా పోయారు.

పేదలకు శుభ్రమైన తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం

మరో రెండునెలల్లో ప్రజల్ని ఓట్లు అడగడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై నిజంగా సిగ్గుపడాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం జగన్ రెడ్డి సర్కార్ కు కొత్త కాకపోయినా, మరీ ఇంతదారుణంగా పేదలకు శుభ్రమైన తాగునీరు కూడా అందించకుండా వారిని బలితీసుకోవడాన్ని తెలుగు దేశం పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. కలుషిత తాగునీటి వల్ల సంభవించిన మరణాలతోపాటు, పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలు కావడానికి జగన్ రెడ్డి, అతని సర్కార్ అసమర్థతే కారణం” అని ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page