Nagar Kurnool MP performed Bhumi Pooja for the new building of the school
పాఠశాల నూతన బిల్డింగ్ కు భూమి పూజ చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ
కల్వకుర్తి మండలం ఎంపి రాములు స్వగ్రామం గుండూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు హాజరై భూమి పూజ నిర్వహించారు.
▫️అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మరియు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి , అదనపు కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు.
▫️ఎంపీ రాములు మాట్లాడుతూ: గ్రామంలో పాఠశాల బాగుంటేనే గ్రామం బాగుంటుంది. నా స్వగ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాలకు సిఎస్ఆర్ నిధుల నుంచి 1 కోటి రూపాయలు జరిగిందన్నారు,
ఎమ్మెల్యే నిధుల నుంచి 25 లక్షలు, ఎమ్మెల్సీ నిధుల నుంచి 20 లక్షలు, మన ఊరు మనబడి స్కీమ్ నుంచి 69 లక్షల ఇరవై మూడు వేలు, అన్ని నిధులతో జిల్లాలోనే ఆదర్శవంతంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని హంగులతో మన పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు.
▫️గ్రామంలో పెద్దలు యువత అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు.
- ▫️ఇంకా అవసరమైతే తన నిధులు వెచ్చిస్తామన్నారు.*
▫️అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కూడా కల్పిస్తామన్నారు.
▫️విద్యార్థులు బాగా చదువుకున్నప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయి అన్నారు.
▫️పాఠశాల భవనాన్ని నాణ్యతగా నిర్మించాలన్నారు - .
▫️పార్లమెంటు - పరిధిలోని కల్వకుర్తి – కొల్లాపూర్ – నంద్యాల- జాతీయ రహదారి గురించి పలుమార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి ఇచ్చి అనుమతులు పొందడం జరిగింది.
▫️కృష్ణా నదిపై నిర్మించే తీగల వంతెన ప్రపంచంలోనే రెండవది, భారతదేశంలో మొట్టమొదటి మొదటిది.
▫️బ్రిడ్జ్ పైన వాహనాలు వెళ్లే విధంగా కింద పర్యాటకులు నడిచే విధంగా ఉంటుంది.
▫️కొల్లాపూర్ పర్యాటక ప్రాంతంగా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు - .
▫️నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
▫️అదేవిధంగా పాఠశాలలో 9 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, మంచిగా చదివి మార్కులు తెచ్చుకుని గ్రామాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు.
▫️అనంతరం గ్రామంలో పర్యటించి, నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు.