వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయాలనే, నా చిరకాల కోరిక నెరవేరింది
ఎంవి ఫౌండేషన్ శాంత సిన్హాకి కృతజ్ఞతలు
వైద్య సేవలు అందించడం నాకెంతో ఇష్టం, అయితే ఆ అవకాశం ప్రభుత్వ రంగంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను
డిఎంహెచ్ఓ, బడ్జెట్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ అధికారి ఆర్ రవీందర్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న ప్రొద్దుటూరు గ్రామ నివాసి నాని పద్మ
శంకర్‌పల్లి: ఫిబ్రవరి 03: ( సాక్షిత న్యూస్): గత ఐదు రోజుల క్రితం, వైద్య ఆరోగ్యశాఖ, రిలీజ్ చేసిన తుది జాబితాలో, జిఎన్ఎం స్టాఫ్ నర్స్ గా, ప్రభుత్వ ఉద్యోగం పొందిన నాని పద్మ, ఈరోజు లాల్ బహుదూర్ స్టేడియంలో ము ఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఎన్నికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా డీఎంహెచ్ఎ ఆర్ రవీందర్ గారి చేతుల మీదుగా శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన నాని పద్మ అపాయింట్మెంట్ లెటర్ అందుకుంది.
ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నా బాల్య జీవితం, బాల కార్మికురాలుగా కొనసాగిందని, మాది అత్యంత నిరుపేద కుటుంబమని, మా తల్లిదండ్రులు నిరుపేద రైతు కూలీలని, అతి కష్టం మీద నన్ను మా తమ్ముడిని చదివించారని, మా తల్లి దండ్రుల కృషికి ఫలితం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, ఇది చిన్న ఉద్యోగమైన మా కుటుంబానికి ఎంతో పెద్ద ఉద్యోగం గా భావిస్తున్నామని, అయితే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ శాంతసిన్హా చొరవతో వారు ఏర్పాటు చేసిన బ్రిడ్జి స్కూల్లో చదువుకొని వారి సహకారంతోనే గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలలో
ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, నాకు స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగం వచ్చిందని, నాకు బాగా కబడ్డీ ఆట నేర్పించి, రాష్ట్రస్థాయికి తీసుకెళ్లి నాకు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ రా వడానికి కృషి చేసిన మా గౌలిదొడ్డి గురుకుల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీబాయి కి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని తెలిపింది. నాకు సహకరిస్తూ వచ్చిన కుటుంబసభ్యులకు కృతఙ్ఞతలు తెలియజేసింది.